Aamani Ruthuve (Instrumental)

Aamani Ruthuve (Instrumental)

A.R. Rahman

Длительность: 5:13
Год: 2007
Скачать MP3

Текст песни

ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
పరిమళములతో వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోటా
ఏవో చింతలు ముసిరేనే
మనసులు వికలము చేసేనే
ఎద నిండా ఏవో బాసలు
మెదిలేనే హోహో
ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
పరిమళములతో వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోటా
వేదనలే రగిలేనే క్రోధనలే మిగిలేనే
తన జ్ఞాపకాలు నాలోన సైయ్యాటలాడే
అడుగులను కలిపామే జతగాను నడిచామే
విపరీతమిలా ఇద్దరిని విడదీసినదే
చేరువనున్న చేరదురా ఆవేదన
ఇక తీరదులే
చీకటి తెర ఏదో
మా నడుమా ఉన్నదే
ఏవో చింతలు ముసిరేనే
మనసును వికలము చేసేనే
ఎద నిండా ఏవో బాసలు
మెదిలేనే హోహో
ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
పరిమళములతో వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోటా
గానమునే విన్నాను హృదయమునే ఇచ్చాను
ఆ జాలిలేని విధి
మా పాలిట వికటించినది
నేనిచట బికారిని తను అచట విరాగిణి
ఏకాంతము ఇద్దరి నీడగ మారినది
కలయికలో ఎడబాటు జరిగినదే పొరపాటు
కన్నులలోనా వసంతమెదలో శిశిరం
ఏవో చింతలు ముసిరేనే
మనసును వికలము చేసేనే
ఎద నిండా ఏవో బాసలు
మెదిలేనే హోహో
ఆమని ఋతువు వచ్చినదే
ప్రేమను అది కవ్వించినదే
పరిమళములతో వేధించినదే పూదోటా
ఏదో బాధ కనిపించినదే ప్రతి చోటా