Prema Swaramulalo

Prema Swaramulalo

A.R. Rahman

Длительность: 4:50
Год: 2016
Скачать MP3

Текст песни

ప్రేమ పరిచయమే దైవదర్శనమే
ప్రేమ స్వరములలో దైవస్మరణములే
అని తెలిసింది తొలిసారి నీ ప్రేమతో
మది మునిగింది నీ ప్రేమలో

ప్రేమ పరిచయమే దైవదర్శనమే
ప్రేమ అడుగులలో దేవతార్చనలే

కోర్కెలసలు కోరుకొనని ప్రేమ తపస్సు మనదిలే
అతిథులెవరు ఎదురు పడని ప్రేమ తిథులు మనవే
అమృతములు ఎగసిపడిన ప్రేమ నదులు మనవే
చరితల కాగితాలలోన చదవలేని ప్రేమనే నీలో చదివా ఈ క్షణాలలో

ప్రేమ పరిచయమే దైవదర్శనమే
ప్రేమ అడుగులలో దేవతార్చనలే

హృదయ గళము పాడుతున్న ప్రేమగీతి మనదిలే
కనుల కలము రాసుకున్న ప్రేమలేఖ మనదే
పెదవి ప్రమిద పంచుతున్న ప్రేమ జ్యోతి మనదే
మనుషుల ఊహలోన సైతం ఉండలేని ప్రేమతో ఎదుటే ఉన్నా ఈ క్షణాలలో

ప్రేమ పరిచయమే దైవదర్శనమే
ప్రేమ అడుగులలో దేవతార్చనలే
అని తెలిసింది తొలిసారి నీ ప్రేమతో
మది మునిగింది నీ ప్రేమలో

ప్రేమ పరిచయమే దైవదర్శనమే
ప్రేమ స్వరములలో దైవస్మరణములే
అని తెలిసింది తొలిసారి నీ ప్రేమతో
మది మునిగింది నీ ప్రేమలో

ప్రేమ పరిచయమే దైవదర్శనమే