Inka Edho

Inka Edho

G.V. Prakash Kumar, Suraj, & Prashanthini

Длительность: 5:16
Год: 2010
Скачать MP3

Текст песни

ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు
సంకెళ్ళతో బంధించకు ఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకు
తనలో నీ స్వరం వినరో ఈ క్షణం అనుకుందేదీ నీలోనే నువు దాచకు
నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా కనిపించాక మౌనాన్నే చూపించకు

మేఘాల ఒళ్ళోనే ఎదిగిందనీ జాబిల్లి చల్లేనా జడివాననీ
ముళ్ళపై మేమిలా విచ్చుకున్నామనీ నీకు పూరేకులే గుచ్చుకోవే మరీ
తీరమే ఓరినా తీరులో మారునా మారదూ ఆ ప్రాణం
ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు

వెళ్ళెళ్ళు చెప్పేసై ఏమవ్వదూ లోలోన దాగుంటే ప్రేమవ్వదూ
అమృతం పంచడం నేరమే అవదురా హాయినే పొందడం భారమే అవదురా
హారతే చూపుతూ స్వాగతం చెప్పదా ఇప్పుడే ఆ అందం