Nuvu Choodu Chudakapo

Nuvu Choodu Chudakapo

M.M.Keeravani

Альбом: Okatonumber Kurradu
Длительность: 4:40
Год: 2002
Скачать MP3

Текст песни

నువ్వు చూడు చూడకపో
నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా
మాటాడు ఆడకపో మాటాడుతునే ఉంటా
ప్రేమించు మించకపో ప్రేమిస్తూనే ఉంటా
నా ప్రాణం నా ధ్యానం నువ్వే లెమ్మంట
నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా

నువ్వు తిట్టినా నీ నోటి వెంట నా పేరొచ్చిందని సంబరపడతా
నువ్వు కొట్టినా నా చెంప మీద నీ గురుతొకటుందని సంతోషిస్తా
మనసు పువ్వును అందించాను కొప్పులో నిలుపుకుంటావో కాలి కింద నలిపేస్తావో
వలపు గువ్వను పంపించాను బొట్టు పెట్టి రమ్మంటావో గొంతు పట్టి గెంటేస్తావో
ఏం చేసినా ఎవరాపినా చేసేది చేస్తుంటా
నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా
మాటాడు ఆడకపో మాటాడుతునే ఉంటా

పూజించటం పూజారి వంతు వరమివ్వటమన్నది దేవత ఇస్టం
ప్రేమించటం ప్రేమికుడి వంతు కరుణించటమన్నది ప్రేయసి ఇస్టం
ఎందువల్ల నిను ప్రేమించిందో చిన్ని మనసుకే తెలియదు గా
నిన్ను మరవటం జరగదు గా ఎందువల్ల నువు కాదన్నావో ఎదురు ప్రశ్నలే వెయ్యనుగా ఎదురు చూపులే ఆపనుగా
ఏనాటికో ఒకనాటికి నీ ప్రేమ సాధిస్తా

నిను చూడలని ఉన్నా నిను చూడలని ఉన్నా నే చూడలేకున్నా
మాటాడాలని ఉన్నా మాటాడలేకున్నా
ప్రేమించాలని ఉన్నా ప్రేమించలేకున్నా
లోలోనా నాలోనా కన్నీరవుతున్నా