Sowbhagyalakshmi

Sowbhagyalakshmi

Padmaja Srinivas

Длительность: 3:30
Год: 2004
Скачать MP3

Текст песни

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మి రావమ్మా

నుదిటి కుంకుమ రవి బింబముగా కన్నులు నిండుగా కాటుక వెలుగా

కాంచన హారము గళమున మెరియగా పీతాంబరముల శోభలు నిండగా
కాంచన హారము గళమున మెరియగా పీతాంబరముల శోభలు నిండగా
సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మి రావమ్మా

నిండుగా కరముల బంగరు గాజులు ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు

గల గల గలమని సవ్వడి చేయగ సౌభాగ్య వతుల సేవలు నందగ
గల గల గలమని సవ్వడి చేయగ సౌభాగ్య వతుల సేవలు నందగ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మి రావమ్మా

సౌభాగ్యమ్ముల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపు రాణి

శుక్రవారపు పూజలు నందగా సాయం సంధ్యా శుభ ఘడియలలో