Manakannapodichey

Manakannapodichey

Rahul Nambiar

Альбом: Parugu
Длительность: 4:40
Год: 2008
Скачать MP3

Текст песни

ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి
నిన్నే ఊరించాలని అన్నాయి
ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి
నిన్నే ప్రేమించాలని అమ్మాయి
దూరం పెంచిన కరిగించానుగా
కళ్లెం వేసినా కదిలొస్తానుగా

మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో
ప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడమ్మో
మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో
నను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో

ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి
నిన్నే ఊరించాలని అన్నాయి
ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి
నిన్నే ప్రేమించాలని అమ్మాయి

అసలిట్టా నీ వెంట నేనెట్టా పడ్డానే
అనుకుంటే అప్సరసయినా నా గుమ్మం లోకొస్తాదే
విసుగెత్తి పోయేలా ఓ బెట్టు చెయ్యొద్దే
చనువిస్తే నా చిరు నవ్వే నీ పెదవుల్లో ఉంటాదే
ఇన్నాళ్లు భూలోకం లో
ఏ మూలో ఉన్నావే
అందిస్తా ఆకాశాన్నే
అంతో ఇంతో ప్రేమించావంటే

మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో
ప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడమ్మో
మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో
నను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో

ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి
నిన్నే ఊరించాలని అన్నాయి

అలనాటి రామయ్య సంద్రాన్నే దాటాడే
బలమైన వారధి కట్టి సీతని యిట్టె పొందాడే
మన మధ్య నీ మౌనం సంద్రం లా నిండిందే
మనసే ఓ వారధి చేసి నీకిక సొంతం అవుతానే

చంద్రున్నే చుట్టేస్తానే
చేతుల్లో పెడతానే
ఇంకా నువ్వు ఆలోచిస్తూ
కాలాన్నంతా ఖాళీ చెయ్యొద్దే

మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో
ప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడమ్మో
మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో
నను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో