Manasa

Manasa

S.V. Krishna Reddy

Альбом: Aahwanam
Длительность: 3:32
Год: 1997
Скачать MP3

Текст песни

మనసా నా మనసా మాటాడమ్మా
ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో ఇంత మౌనమా
మనసా నా మనసా మాటాడమ్మా
ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో
ఇంత మౌనమా
మనసా నా మనసా మాటాడమ్మా

చెవిలో మంగళవాద్యం మోగేటి వేళలో
విన్నా నీ అనురాగపు తేనె పాటని
మేడలో మంగళసూత్రం చిందించు కాంతిలో
చూసా నీతో సాగే పూల బాటని
నీతో ఏడడుగులేసి నడిచిన ఆ నిమిషం
నాతో తెలిపిందోకటే తిరుగులేని సత్యం
నేను అన్న మాటకింకా అర్ధం నీవంటూ
మనసా నా మనసా మాటాడమ్మా

తల్లి తండ్రి నేస్తం ఏ బంధమైనా
అన్ని నీ రూపంలో ఎదుట నిలిచేగా
తనువు మనసు ప్రాణం నీవైనా రోజున
నాదని వేరే ఏది మిగిలేదుగా
ఎగసే కెరటాల కడలి కలుపుకున్న వెనుక
ఇదిగో ఇది నది అంటూ చూపగలరా ఇంకా
నీవులేని లోకామింకా నాకు ఉండదంటూ
మనసా నా మనసా మాటాడమ్మా
ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో
ఇంత మౌనమా
మనసా నా మనసా