Madai Thiranthu
S.P. Balasubrahmanyam
4:22ఇలాగ వచ్చి అలాగ తెచ్చి ఎన్నో వరాల మాలలు గుచ్చి నా మెడ నిండా వేశావు నన్నో మనిషిని చేశావు ఎలాగ తీరాలి ఈ ఋణమెలాగ తీరాలి ఎలాగ తీరాలి ఈ ఋణమెలాగ తీరాలి తీరాలంటే దారులు లేవా కడలి కూడా తీరం లేదా అడిగినవన్నీ ఇవ్వాలీ అడిగినప్పుడే ఇవ్వాలీ అలాగ తీరాలి నా ఋణమలాగ తీరాలి అలాగ తీరాలి నా ఋణమలాగ తీరాలి అడిగినప్పుడే వరమిస్తారు ఆకాశంలో దేవతలు అడిగినప్పుడే వరమిస్తారు ఆకాశంలో దేవతలు అడగముందే అన్నీ ఇచ్చే నిన్నే పేరున పిలవాలి నిన్నే తీరున కొలవాలి అసలు పేరుతో నను పిలవద్దు అసలు కన్నా వడ్డీ ముద్దు ముద్దు ముద్దుగా ముచ్చట తీర పిలవాలి నను కొలవాలి అలాగ తీరాలి నా ఋణమలాగ తీరాలి అలాగ తీరాలి నా ఋణమలాగ తీరాలి కన్నులకెన్నడూ కానగరానిది కానుకగా నేనడిగేది కన్నులకెన్నడూ కానగరానిది కానుకగా నేనడిగేది అరుదైనది నీ వడిగేది అది నిరుపేదకెలా దొరికేది ఈ నిరుపేదకెలా దొరికేది నీలో ఉన్నది నీకే తెలియదు నీ మనసే నే కోరుకున్నది అది నీకెపుడో ఇచ్చేశానే నీ మదిలో అది చేరుకున్నది ఇంకేం ఇలాగ తీరింది మన ఋణమిలాగ తీరింది ఇలాగ తీరింది మన ఋణమిలాగ తీరింది