Andhama Andhama

Andhama Andhama

S.P.Balasubramanyam

Альбом: Govinda Govinda
Длительность: 5:21
Год: 1994
Скачать MP3

Текст песни

అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ
పరవశాలు పంచావమ్మా పాల సంద్రమా
అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ
పరవశాలు పంచావమ్మా పాల సంద్రమా
ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మా
అందమా అందుమా అందనంటే అందమా

ఆకలుండదే దాహముండదె ఆకతాయి కోరిక
కొరుక్కు తింటాదే
ఆగనంటదే దాగానంటదే ఆకు చాటు వేడుక
కిర్రెక్కమంటదే
వన్నెపూల విన్నపాలు విన్ననమ్మి
చిటికనేలు ఇచ్చి ఏలుకుంటానమ్మి
రాసిపెట్టి ఉంది గనక నిన్నే నమ్మి
ఊసులన్నీ పూసగుచ్చి ఇస్తా సుమీ
ఆలనా పాలనా చూడగా చేరాన చెంత
అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా

వెయ్యి చెప్పినా లక్ష చెప్పినా
లక్ష్య పెట్టాడే ఎలా ఇదేమి విల విలా
తియ్య తియ్యగా నచ్చ చెప్పని
చిచ్చి కొట్టని ఇలా వయ్యారి వెన్నెల
నిలవనీదు నిదరపోదు నారాయణ
వగలమారి వయసు పోరు నా వల్లనా
చిలిపి ఆశ చిటికలోన తీర్చెయ్యనా
మంత్రమేసి మంచి చేసి లాలించానా
ఆదుకో నాయనా ఆర్చావా తీర్చవా చింత
అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ
పరవశాలు పంచావమ్మా పాల సంద్రమా
ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మా