Pralayama Nee

Pralayama Nee

S.P.Balasubramanyam

Альбом: Allari Priyudu
Длительность: 4:02
Год: 1993
Скачать MP3

Текст песни

ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా
ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా
గమ్యం తెలియని పయనమా
ప్రేమకు పట్టిన గ్రహణమా
తెలుపుమా తెలుపుమా తెలుపుమా

ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా
ప్రేమ కవితా గానమా
నా ప్రాణమున్నది శృతి లేదా
గేయమే యద గానమైనది
వలపు చితిని రగిలించగా
తీగ చాటున రాగమా
ఈ దేహమున్నది జతలేకా
దాహ మారని స్నేహమై
ఎద శిధిల శిశిరమై మారగా
ఓ హృదయమా ఇది సాధ్యమా
రెండుగ గుండే చీలునా
ఇంకా ఎందుకు శోధన
ఎండుగకుంటే చీలునా
ఇంకా ఎందుకు శోధన
తెలుపుమా తెలుపుమా తెలుపుమా

ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా
ప్రేమ సాగర మధనమే
జరిగింది గుండెలో ఈ వేళ
రాగమన్నది త్యాగమైనది
చివరికెవరికీ అమృతం
తీరమెరుగని కెరటమై
చెలరేగు మనసులో ఈవేళ
అశ్రుధారలే అక్షరాలుగా
అనువదించే నా జీవితం
ఓ ప్రాణమా ఇది న్యాయమా
రాగం అంటే త్యాగమా
వలపుకు ఫలితం శూన్యమా
వలపుకు ఫలితం శూన్యమా
తెలుపుమా తెలుపుమా తెలుపుమా

ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా
ప్రణయమా నీ పేరేమిటి ప్రళయమా