Matarani
S.P.Balasubramanyam & S.Janaki
4:37అరె ఏమైంది అరె ఏమైంది ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది అది ఏమైంది తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలింది కలగాని కలఏదొ కళ్ళెదుటె నిలిచింది అది నీలో మమతను నిద్దుర లేపింది అరె ఏమైంది ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది అది ఏమైంది నింగి వంగి నేలతోటి నేస్తమేదొ కోరింది నేల పొంగి నింగి కోసం పూలదోసిలిచ్చింది పూలు నేను చూడలేను పూజలేవి చేయలేను నేలపైన కాళ్ళులేవు నింగివైపు చూపులేదు కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూసావొ కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావు అది దోచావూ లలలలల బీడులోన వాన చినుకు పిచ్చి మొలక వేసింది పాడలేని గొంతులోన పాటఏదొ పలికింది గుండె ఒక్కటున్న చాలు గొంతు తానే పాడగలదు మాటలన్ని దాచుకుంటే పాట నీవే రాయగలవు రాత రానివాడి రాత దేవుడేమి రాసాడో చేతనైతే మార్చి చూడు వీడు మారిపోతాడు మనిషౌతాడు అరె ఏమైంది ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది అది ఏమైంది తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలింది కలగాని కలఏదొ కళ్ళెదుటె నిలిచింది అది నీలో మమతను నిద్దుర లేపింది అరె ఏమైంది ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది అది ఏమైంది