Om Namaha

Om Namaha

S.P.Balasubramanyam & S.Janaki

Альбом: Geetanjali
Длительность: 4:04
Год: 1989
Скачать MP3

Текст песни

ఓం నమహా నయన శృతులకు ఓం నమహా హృదయ లయలకు ఓం
ఓం నమహా అధర జతులకు ఓం నమహా మధుర శ్మృతులకు ఓం
నీ హృదయం తపన తెలిసీ నా హృదయం కనులు తడిసే వెళలో
ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో

రేగిన కొరికలతో గాలులు వీచగా
జీవన వేణువులలొ మోహన పాడగా
దూరము లేనిదై లోకము తోచగా
కాలము లేనిదై గగనము అందగా
సూరిడే ఒరిగి ఒరిగి జాబిల్లి ఒడిని అడిగే వేళా
ముద్దుల సద్దుకే నిదుర లేచే  ప్రణయ గీతికి ఓం

ఒంటరి బాటసారి జంటకు చేరగా కంటికి పాపవైతే రెప్పగ మారనా
తూరుపు నీవుగా వేకువ నేనుగా అల్లిక పాటగా పల్లవి ప్రేమగా
ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే
జగతికే అతిధులై జననమందిన ప్రేమ జంటకి
ఓం నమహా నయన శృతులకు ఓం
ఓం  నమహా హృదయ లయలకు ఓం
నీ హృదయం తపన తెలిసీ నా హృదయం కనులు తడిసే వెళలో
ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో