Amma Ani Kothaga

Amma Ani Kothaga

Shashikiran & Shravana Bhargavi

Альбом: Life Is Beautiful
Длительность: 5:48
Год: 2012
Скачать MP3

Текст песни

అమ్మా అని కొత్తగా
మళ్లీ పిలవాలని
తుళ్లే పసి ప్రాయమే
మళ్లీ మొదలవ్వని

నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా
అమ్మా అని కొత్తగా
మళ్లీ పిలవాలని
తుళ్లే పసి ప్రాయమే
మళ్లీ మొదలవ్వని
నిదురలో నీ కల చూసి
తుళ్లి పడిన ఎదకి
ఏ క్షణం ఎదురవుతావో
జోల పాటవై
ఆకలని అడగక ముందే
నోటి ముద్ద నువ్వై
ఏ కథలు వినిపిస్తావో జాబిలమ్మవై

నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా
చిన్ని చిన్ని తగవులే
మాకు లోకమైన వేళ
నీ వెతను మనసెపుడైన పోల్చుకున్నదా
రెప్పలా కాచిన నీకు
కంటి నలుసు లాగా
వేదనలు పంచిన మాకు వేకువున్నదా

నింగీ నేలా నిలిచేదాకా తోడుగా
వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
నువు కావాలే అమ్మా
నను వీడొద్దే అమ్మా
బంగారం నువ్వమ్మా