Jaanu
Srinidhi Nerella
4:17అలనాటి అందాల తారవో నా శతకోటి ఆశల రాణివో మురిపాల ముత్యాల తోడువో నా పరువాల ఈడుకు జోడువో అరుదైన సొగసుల సింగారివమ్మా మనసైన మధురాల వయ్యారి బొమ్మ తనువంతా తలిచేది నీ నామమేగా కనిపెట్టుకోలేవా ఈ సిగ్గు బాష చాలమ్మ చాలమ్మ ఈ ఒక్క మాట నీ కన్నే పాదాల పారాణినైత రాయే నా వలపుల గంధమా నా వరసైన వందేళ్ల బంధమా ఆ పంచభూతాల సాక్షిగా ఏకమవ్వాలి నువ్వు నేను జంటగా ముక్కోటి దేవుళ్ళను మొక్కుకుంటుననే అమ్ములు నీ తాళి బొట్టును నీ కాలి మెట్టెను అయితను నేనెప్పుడూ అయ్యయ్యో ఆరాటము అర్ధమయిందిలే తాపము నా అయిదోతనమంతా నీ తనువు ఏనాడో అయిందిలే సగభాగము ఏడున్నావే నువ్వు నా ఎన్నెలమ్మ ఎడబాటు చాలు ఎన్నేళ్లు ఇంకా ఎంతెంత దూరంగా మనమంతా ఉంటే అంతంత మన మంచికే మంచిదంట చాలమ్మో చాలమ్మ ఈ ప్రేమ జూదం నాతోని కాదమ్మో ఈ దూర భారం రాయే నా వలపుల గంధమా నా వరసైన వందేళ్ల బంధమా ఆ పంచభూతాల సాక్షిగా ఏకమవ్వాలి నువ్వు నేను జంటగా ఏ మంత్రం వేసినవో నా మనసంతా దోచినావు సావైన బతుకైనా నీ వెంటే ఉండాలంటున్నదే ప్రాణము ఎన్నెన్ని అడ్డంకులో నిన్ను చేరేటి నా గుండెకు ఎట్లైతే గట్లాయే అనుకోని కొట్లాడితే నువ్వు దక్కినావు నీకంత scene ఐతే లేదనుకున్నా దేవుని దయవలన నీ పెళ్లామైనా అట్లుంటదే పిల్ల మా వంశం అంటే అనుకుంటే ఏదైనా ఈడిచేదే లేదే ఏదున్నా లేకున్నా నువ్వుంటే చాలే గుటుక కూడు తిన్న సంతోషమేలే రాయే నా వలపుల గంధమా నా వరసైన వందేళ్ల బంధమా ఆ పంచభూతాల సాక్షిగా ఏకమైనాము నువు నేను జంటగా