Neethone

Neethone

Anurag Kulkarni & Madhura Dhara Talluri

Длительность: 4:26
Год: 2019
Скачать MP3

Текст песни

నీతోనే అడుగు వేయనా
నీ తోడు నేను అడగనా
పరదా దాటనా సరదా దారిన
నూరేళ్ళు తీరిపోని మాటలాడి అలసిపోనా
నీతోనే నీతోనే
నీతోనే అడుగు వేయనా
నీ తోడు నేను అడగనా

నేనంటూ నే లేను నేనే నువ్వైయ్యాను
కల కంటి కల పాప ఈ జీవితం
నిదుర మేల్కొన్న కలలోనూ నువ్వు నా నిజం
నిన్ను కాచుకున్న వరమే
మీద పడ్డ నీడ ప్రియమే
చంపొద్దే కోర కళ్ళతో
నీతోనే అడుగు వేయనా (నీతోనే అడుగు వేయనా)
నీ తోడు నేను అడగనా (నీ తోడు నేను అడగనా)

చిమ్మే వర్షం కప్పేసుకుందాం దుప్పటిలా
చేతుల తలుపు వేస్కుందాం ఎప్పటిలా
చలిలోన చెలి ముద్దు చెల్లించాలా
చివరి దాకా ఉసురల్లే చూస్కోవాలా
సదా ఎదే నీదే అన్నా
పదే పదే ఇచ్చేస్తున్నా నీకే నీకే వెగటు రాని వలపుని
నీతోనే అడుగు వేయనా (నీ తోడు నేను అడగనా)
నీ తోడు నేను అడగనా (నీతోనే అడుగు వేయనా)
పరదా దాటనా సరదా దారిన
నూరేళ్ళు తీరిపోని మాటలాడి అలసిపోనా
నీతోనే నీతోనే
నీతోనే అడుగు వేయనా
నీ తోడు నేను అడగనా
నీ తోడు నేను అడగనా