Nachavule Nachavule (From "Virupaksha")

Nachavule Nachavule (From "Virupaksha")

B. Ajaneesh Loknath

Длительность: 3:43
Год: 2023
Скачать MP3

Текст песни

నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే
నచ్చావులే నచ్చావులే నీ కొంటె వేషాలే చూసాకే
తడబడని తీరు నీదే తెగబడుతు దూకుతావే
ఎదురుపడి కూడా ఎవరోలా నను చూస్తావే
బెదురు మరి లేదా అనుకుందే నువు చేస్తావే
ఏ నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే

కపటి కపటి కపటి కపటి కపటి కపటి కపటి కపటి కపటి కపటియా నా నా

అప్పుడే తెలుసనుకుంటే అంతలో అర్థం కావే పొగరుకే అనుకువే అద్దినావే
పద్దతే పరికిణీలోనే ఉన్నదా అన్నట్టుందే అమ్మడూ నమ్మితే తప్పు నాదే
నన్నింతలా ఏమార్చిన ఆ మాయ నీదే
నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే

పైకలా కనిపిస్తావే మాటతో మరిపిస్తావే మనసుకే ముసుగునే వేసినావే
కష్టమే దాటేస్తావే ఇష్టమే దాచేస్తావే లోపలో లోకమే ఉంది లేవే
నాకందులో ఏ మూలనో చోటివ్వు చాలే
తడబడని తీరు నీదే తెగబడుతు దూకుతావే
ఎదురుపడి కూడా ఎవరోలా నను చూస్తావే
బెదురు మరి లేదా అనుకుందే నువ్ చేస్తావే

నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే
నచ్చావులే నచ్చావులే నీ కొంటె వేషాలే చూసాకే