Nuvvante Na Navvu

Nuvvante Na Navvu

Haricharan Seshadri

Длительность: 4:35
Год: 2016
Скачать MP3

Текст песни

నువ్వంటే నా నువ్వు నేనంటేనే నువ్వు
నువ్వంటు నేనంటు లేమని
ఔవునంటు మాటివ్వు నిజమంటునే నువ్వు
నే రాని దూరాలు నువు పోనని
ఎటువున్నా నీ నడక వస్తాగ నీ వెనుక
దగ్గరగా రానీను దూరమే
నే వెసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్వడుగు
నిలుచున్న నీ వైపే చేరేనులే
నీ అడుగేమొ పడి నేల గుడి ఐనదే
నీ చూపేమో సడి లేని ఉరుమైనదే
నువ్వు ఆకాశం నేను నీ కోసం
తడిసిపోదామా ఈ వానలో
ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే
సుర్యుడితో జతకట్టి ఒకటవుతాయే
నీడల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే
ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమ
ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే
సుర్యుడితో జతకట్టి ఒకటవుతాయే
నీడల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే
ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమ

నే ఇటు వస్తాననుకోలేదా తలుపస్సలు తీయవు తడితే
పో పసివాడని జాలేపడితే బుగ్గన ముద్దిచ్చి చంపేసావే
నువ్వు నేనంటు పలికే పదముల్లో అధరాలు తగిలేనా కలిసేవున్నా
మనమంటు పాడు పెదవుల్లో చూడు క్షణమైన విడిపోవులే
ఇది ఓ వేదం పద ఋజువౌవుదాం
అంతులేని ప్రేమకే మనం
నివురు తొలిగేలా నిజము గెలిచేలా
మౌనమే మాట మార్చేసెనా

నా నవ్వేటి కోపానివే మనసతికిన ఓ రాయివే
నువ్ కలిసొచ్చె శాపానివే నీరల్లే మారేటి రూపానివే
నచ్చే దారుల్లో నడిచే నదులైనా
కాదన్నా కలవాలి సంద్రంలోన
విడి విడి గా వున్నా విడిపోలేకున్న
ప్రవహించే ప్రణయం ఇదే
వద్దన్నా తిరిగేటి భువిమీదొట్టు
నా ప్రాణం తిరిగేనే ఇక నీ చుట్టూ
నాలోనే నువ్వుంటు నీతోనే నేనంటు
ఈ భువిలో విహరించే వెలుగే మన ప్రేమా