Mudduletti
Sonu Nigam
4:19ఇది రణరంగమా లేక అగ్ని గుండమా విధి నడిపే ప్రేమ అర్ధమవదే ఇది రణరంగమా లేక అగ్ని గుండమా విధి నడిపే ప్రేమ అర్ధమవదే అగ్ని కణము నీటి గుణము రెంటిని కలిపితే నువ్వేనా ఇవతలి వైపు దేవతవైతే అవతలి వైపు దెయ్యమువా సమయం తింటావ్ మెదడుని తింటావ్ నన్నే తింటావ్ తప్పు కాదా పని పాట లేని పిల్లా ఇంట్లో నీకు తిండి లేదా చూపులు తగలగ మాటలు పెగలగ ఉరుములు మెరుపులు ఆరంభం పాదం కేశం నాభి కమలం రగులు కొనగా ఆనందం ధగ ధగమని వెలిగెను జ్వాల సెగ సెగమని ఎగిరెను బాలా తహతహమని తపనల గోల కసి కసియని కౌగిలి ఏలా (ఏలా, ఏలా, ఏలా) మిత్రుల బృందం ఎదురే వస్తే పక్కకి తొలగి నడిచితిని పొద్దుట నిన్ను చూస్తానంటూ రాత్రినంతా గడిపితిని ఇట్టా ఇట్టా రోజులు గడవగ ఇంకా నన్నేం చేస్తావు మాయా మంత్రం తెలిసిన దానా త్వరగా నన్ను చంపెదవా ఏ తాడైనా నీ తలపుల్ని బిగిసేలాగ కడుతుందా నన్నే కాల్చగ ఎముకల గూడు నీ పేరేగా చెబుతుంది చిటపటమని చిందేస్తావా వదులొదులని విదిలిస్తావా దడదడమని జడిపిస్తావా ఒంటరిగా వదిలేస్తావా ఇది రణరంగమా లేక అగ్ని గుండమా విధి నడిపే ప్రేమ అర్ధమవదే