Nindu Noorella

Nindu Noorella

Mahalakshmi & Sonu Nigam

Длительность: 3:32
Скачать MP3

Текст песни

నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమయ్యింది వనవాసం
దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం
బ్రహ్మే ఓహో అనే ముహూర్తం కనుల ముందుందిలే
జగమే అలా ఇలా ఉయ్యాలై ఊగి మురిసిందిలే
నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమయ్యింది వనవాసం
దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెనెల్లో కళ్యాణం

బతుకు ఆడు ఆటలో మరణం అంటే ఏమిటి ఆటలోని అలుపు అంటి చిన్న మలుపులేహే
జీవితాన్ని అందకా జీవమేల్లిపోదులే ఆరిపోని అణిగిపోని చిరంజీవిలే
తల నిండుగా ఆశీస్సులే ఇక నిండగా ఆయూషులే
యముని పాశమే బిగుసుకున్ననూ మరణమన్నదీ మరల జననమే
నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమయ్యింది వనవాసం
దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం
బ్రహ్మే ఓహో అనే ముహూర్తం కనుల ముందుందిలే
జగమే అలా ఇలా ఉయ్యాలై ఊగి మురిసిందిలే