Neetho Edo

Neetho Edo

Swetha Mohan & Sai Karthik

Альбом: Paisa
Длительность: 4:25
Год: 2013
Скачать MP3

Текст песни

ఈరోజే మాయ్యా సయ్యారే హరే మోరేసా
ఈరోజే మాయ్యా సయ్యారే
నీతో ఎదో అందామనిపిస్తోంది
ఎపుడు నీతో ఉండాలనిపిస్తోంది
నా పుట్టుక నీతో మొదలైంది
నీతోనే పూర్తయిపోతుంది
ఇంకెలా చెప్పను మాటల్లో వివరించి
నీకెలా చూపాను నా మనసింతకుమించి
నీతో ఎదో అందామనిపిస్తోంది
ఎపుడు నీతో ఉండాలనిపిస్తోంది

ఈరోజే మాయ్యా సయ్యారే హరే మోరేసా
ఈరోజే మాయ్యా సయ్యారే
స రి గ మ ప ని సా...
ని సా ని సా ని సా ని ని సా ని స గ రి స
స రి గ మ ప ని సా...
ని సా ని సా ని సా ని ని సా ని స గ రి స

కంటికి నువు కనిపిస్తే ఉదయం అయ్యిందంటా
ఇంటికి పో అంటే సాయంత్రం అనుకుంటా
నువ్వు నను పిలిచేటపుడే నా పేరుని గుర్తిస్తా
నీ వైపుకి కదిలే అడుగులనే నడకంటా
ఏమౌతావు నువ్వు అంటే ఏమో తెలియదు గాని
ఏమి కావు అంటే లోలో ఎదో నొప్పిగా ఉంటుంది
ఈరోజే మాయ్యా సయ్యారే హరే మోరేసా
ఈరోజే మాయ్యా సయ్యారే

తెలియని దిగులవుతుంటే నిను తలచే గుండెల్లో
తియ్య తియ్యగా అనిపిస్తుందే ఆ గుబులు
ముచ్చెమటలు పోస్తుంటే వెచ్చని నీ ఊహల్లో
మల్లెలు పూస్తున్నట్టోళ్లంతా ఘుమ ఘుమలు
బతకడమంటే ఏమిటంటే సరిగా తెలియదు గాని
నువ్విలాగా నవ్వుతుంటే చూస్తూ ఉండడం అనుకోని
ఈరోజే మాయ్యా సయ్యారే హరే మోరేసా
ఈరోజే మాయ్యా సయ్యారే
నీతో ఎదో అందామనిపిస్తోంది
ఎపుడు నీతో ఉండాలనిపిస్తోంది