Devudu Karunisthadani

Devudu Karunisthadani

Rajesh

Альбом: Prema Katha
Длительность: 5:00
Год: 1999
Скачать MP3

Текст песни

దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు
స్వర్గం ఒకటుంటుంది అంత అంటుంటే విని
నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకు
ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో
మనసున మనసై బంధం వేసే ఉన్నదో
ఏమో ఏమైనా నీతో ఈపైన
కడదాకా సాగనా
దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు
స్వర్గం ఒకటుంటుంది అంత అంటుంటే విని
నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకు

నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం ఈ మాట సత్యం
నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతిక్షణం సుఖమేగా నిత్యం
పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది
ఇదే పాట గుండెల్లో సదా మోగుతోంది
నేనే నీకోసం నువ్వే నాకోసం
ఎవరేమి అనుకున్న
దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు
స్వర్గం ఒకటుంటుంది అంత అంటుంటే విని
నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకు

ప్రేమనే మాటకర్ధమే తెలియదు ఇన్నాళ్ల వరకు
మనసులో ఉన్న అలజడే తెలియదు నిను చేరే వరకు
ఏటేళ్లేదో జీవితం నువ్వే లేకపోతే
ఎడారిగా మారేదా నువ్వే రాకపోతే
నువ్వు నీ నవ్వు నాతో లేకుంటే
నేనంటూ ఉంటానా
దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు
స్వర్గం ఒకటుంటుంది అంత అంటుంటే విని
నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకు
ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో
మనసున మనసై బంధం వేసే ఉన్నదో
ఏమో ఏమైనా నీతో ఈపైన
కడదాకా సాగనా
దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు
స్వర్గం ఒకటుంటుంది అంత అంటుంటే విని
నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకు
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు
నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకు