Abbo Neeyamma

Abbo Neeyamma

S.P.Balasubramanyam

Альбом: Anji
Длительность: 5:46
Год: 2004
Скачать MP3

Текст песни

అబ్బో నీ అమ్మ గొప్పదే
అందం పోగేసి కన్నదే
అబ్బో నీ అమ్మ గొప్పదే
అందం పోగేసి కన్నదే
పరువాలు పొదిగిన చిలక
చలి జోరుగున్నది గనుక
జతగా శృతిగా
ఇక నువ్వూ నేను ఒకటైపోయి పాడేద్దామా సరిగమప

అమ్మో ఏ రాణి కన్నదో
ఎదలో ఏం మొక్కుకున్నదో
అమ్మో ఏ రాణి కన్నదో
ఎదలో ఏం మొక్కుకున్నదో
జగదేక వీర కుమారా
వలచాను నిను మనసారా
అనరా కనరా
నా వన్నెచిన్నెలన్ని నీవి కన్నె చేయి విడవకురా

పూల ఋతువిదే కోమలి
తీర్చమన్నదే ఆకలి
ఆశ ముదిరిన వేళలో
శ్వాస పరుగులు తియ్యదా
తనువింతై అంతై తెర దించెయ్ దించెయ్ మంటే విడువగ నా తరమా
సొగసింతై అంతై దారికొచ్చెయ్ వచ్చెయ్ మంటే నిలువగ నా తరమా
తమకాలు విడువవు గనుక
తడి చీర బిగిసెను గనుక
చెలియా చెలియా
ఇక ఉల్లాసంగా ఆడేద్దామా ఉయ్యాలాట కసి మొలకా

అమ్మో ఏం కొంటె పిల్లడో
ఏమా సన్నాయి నొక్కుడో
అమ్మో ఏం కొంటె పిల్లడో
ఏమా సన్నాయి నొక్కుడో
కసి మీద ఉన్నడు గనుక
పస చూడమన్నడు గనుక
ఒడిలో ఒదిగి ఇక చూపిస్తాలే వయ్యారాల ఆటుపోటు తడబడక

భారమైనది నా ఎద
జారుతున్నది పై ఎద
చేరుకున్నదే తుమ్మెద, దోచిపెట్టవే సంపద
ఒళ్ళు తుళ్ళి తుళ్ళి అరె మళ్ళి మళ్ళి సరసానికి త్వరపెడితే
ఓసి బుల్లి, బుచ్చి నిన్ను గిల్లి గిచ్చి ఒడి దాడికి ఎగబడితే
హృదయాలు కలిసెను గనుక
సుఖమేదో కలిగెను గనుక
ప్రియుడా ప్రియుడా
అరె మళ్ళి మళ్ళి సాగించేద్దాం సందిట్లోన సరిగమప

అబ్బో నీ అమ్మ గొప్పదే
అందం పోగేసి కన్నదే అబ్బ అబ్బ అబ్బ
అబ్బో నీ అమ్మ గొప్పదే
అందం పోగేసి కన్నదే
పరువాలు పొదిగిన చిలక
చలి జోరుగున్నది గనుక
జతగా శృతిగా
ఇక నువ్వూ నేను ఒకటైపోయి పాడేద్దామా సరిగమప