Mogali Podalu

Mogali Podalu

Rajesh & Sujatha

Альбом: Chandralekha
Длительность: 4:33
Год: 1998
Скачать MP3

Текст песни

మొగలి పొదలు కదిలి సెగలు ఒదిలి చలి గాలి కాగాలి
అగరు పొగలు తగిలి సొగసు రగిలి జతకేళి సాగాలి
తీగ మల్లి నాగై ఊగాలి
వేగే ఒళ్ళే అలలై పొంగాలి
మొగలి పొదలు కదిలి సెగలు ఒదిలి చలి గాలి కాగాలి
వేగే ఒళ్ళో నాగై ఆడాలి

మదన మధురవళి మదిని మృదు మురళి
పదును గాయాలు చేసె

మధురిమల కడలి అధరముల కదిలి
పడుచు గేయాలు రాసె
అందుకో కౌగిలి
కందిపో కోమలి
మొగలి పొదలు కదిలి సెగలు వదిలి చలి గాలి కాగాలి
వేగే ఒళ్ళే అలలై పొంగాలి

చెలిమి కలగలిపి చిలిపి లిపి తెలిపి
వలపు రేపావు నాలో

ఉలిని ఉసిగొలపి శిలల కల కదిపి
కళలు లేపావు నాలో
ఆడుకో నాగిని
ఆదుకో ఆశని
మొగలి పొదలు కదిలి సెగలు ఒదిలి చలి గాలి కాగాలి
అగరు పొగలు తగిలి సొగసు రగిలి జతకేళి సాగాలి
లాలి లాలి పాడే జాబిల్లి
జ్వాలే మారి జంటే కోరాలి
మొగలి పొదలు కదిలి సెగలు ఒదిలి రరరార రారారా