Eduta Neeve

Eduta Neeve

S.P.Balasubramanyam

Альбом: Abhinandana
Длительность: 4:16
Год: 1987
Скачать MP3

Текст песни

ఎదుటా నీవే ఎదలోనా నీవే
ఎదుటా నీవే ఎదలోనా నీవే
ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే
ఎదుటా నీవే ఎదలోనా నీవే

మరుపే తెలియని నా హృదయం
తెలిసీ వలచుట తొలి నేరం
అందుకే ఈ గాయం
మరుపే తెలియని నా హృదయం
తెలిసీ వలచుట తొలి నేరం
అందుకే ఈ గాయం
గాయాన్నైనా మాననీవు
హృదయాన్నైనా వీడిపోవు
కాలం నాకు సాయం రాదు
మరణం నన్ను చేరనీదు
పిచ్చి వాడ్ని కానీదు అహహహ ఒహొహొహో ఉహుహుహు
ఎదుటా నీవే ఎదలోనా నీవే
ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే
ఎదుటా నీవే ఎదలోనా నీవే

కలలకు భయపడి పోయాను
నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను
కలలకు భయపడి పోయాను
నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను
స్వప్నాలైతే క్షణికాలేగా
సత్యాలన్ని నరకాలేగా
స్వప్నం సత్యమైతే వింత
సత్యం స్వప్నమయ్యేదుందా
ప్రేమకింత బలముందా అహహహ ఒహొహొహో ఉహుహుహు
ఎదుటా నీవే ఎదలోనా నీవే
ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే