Unnamata Cheppanivu
Tippu
4:41ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ ప్రేమైందో ఏమో అనుమానం కలిగేలా అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ ప్రేమైందో ఏమో అనుమానం కలిగేలా అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే (హాయ్ రామా ఇదేమి ప్రేమా హంగామా భరించ తరమా అందమ్మా అయోమయంగా ఉక్కిరి బిక్కిరి ఊపిరి సరిగమ) (హాయ్ రామా ఇదేమి ప్రేమా హంగామా భరించ తరమా అందమ్మా అయోమయంగా ఉక్కిరి బిక్కిరి ఊపిరి సరిగమ) ఏ చోటా నా పాదం నిలబడనంటుందీ ప్రతి బాట నీ వైపే పద పద అంటోందీ మనసంతా ఎందుకనో దిగులుగ ఉంటుందీ అది కూడా చిత్రంగా బాగానే ఉందీ ఉప్పెనలా హృదయంలో చెలరేగే కలవరం తప్పుకునే దారేదో వెతకాలీ ఇద్దరం ఎప్పుడు మొదలయ్యిందో నను లాగే ప్రియ స్వరం ఎప్పుడు ఎటు తోసుందో చెబుతుందా ఈ క్షణం అనుకోకుండా పడదోసింది వలపే నన్నిలా హో, విడిపోకుండా ముడివేసింది బిగిసే సంకెలా (ఏమైందో మతే చెడంగా చిక్కామో అమాయకంగా గుండెల్లో అదో రకంగా చిందర వందర తొందర తికమక ఏమైందో మతే చెడంగా చిక్కామో అమాయకంగా గుండెల్లో అదో రకంగా చిందర వందర తొందర తికమక) ఎవరైనా నీ పేరు అనుకుంటే చాలూ కోపంతో ఎర్రబడే కసిరే నా కళ్ళూ ఎవరైనా నిను కొంచెం గమనిస్తే చాలూ గుండె సడి ఉలికిపడి ఒకటే కంగారూ చప్పున ఒకటై పోదా ఈ దూరం జరగనీ ఎక్కడికైనా పోదా మన లోకం వేరనీ ఎవ్వరికీ ఏమాత్రం కనిపించం పొమ్మనీ ఆ క్షణమే మనకోసం ఏకాంతం చూడనీ చిటికే వేసి పిలిచే ప్రేమ మనతో చేరగా మనలో చేరి కరిగే ప్రేమ మనమై మారగా ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ ప్రేమైందో ఏమో అనుమానం కలిగేలా అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే ఓ, నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే ఓ, అవునో కాదో అడగాలంటే తెగువే చాలదే ఓహో హో, నిజమో కాదో తెలియకపోతే తగువే తేలదే