Nanda Nandhana

Nanda Nandhana

S.P.Balasubramanyam

Альбом: Ravoyi Chandamama
Длительность: 4:15
Год: 1999
Скачать MP3

Текст песни

నంద నందనా ముద్దే ముందు ముందునా
అందు ఇందునా నేనే నీకు చెందనా
వరించాను వెచ్చగా వసంతాల చాటు నా
సుఖించాలి జంట గా సుతారాలు మీటనా
నా మాట విను మదన విడిచి నేను పో గలనా
లవ్ అన్నదే తపనా లాలి పాడవే లలనా
నంద నందనా ముద్దే ముందు ముందునా
అందు ఇందునా నేనే నీకు చెందనా

నాజుక్ కు లూగి నాదాలు రేగి నాదాని వవుతుంటే
సొంపుల్లో సోకు సంపంగి రేకు సొంతాలు చేస్తుంటే
ఏ తేనె తీగో నీ కంటి చూపై కాటేసి పోతుంటే
నా కన్నె పూల దాగున్న తేనె నీ కంటుకుంటుంటే
నీ లయలు హృదయముల యమున లైన సమయమున
నా మనసు నీ మధుర మధురమైనదీ కదరా
నంద నందనా ముద్దే ముందు ముందునా
అందు ఇందునా నేనే నీకు చెందనా

ఆ మంచు కొండ ప్రేమించు గుండె మల్లెల్లొ ఇల్లేస్తే .
మత్తెక్కి పోయి నా కళ్ళా నిండా ఆ కళ్ళు నింపెస్తా .
నీలాల కురుల మేఘాల తెరలా అందాలు ఆరెస్తే .
సూరీడు తగిలి నా ఈడు రగిలి ఆరాలు తీసేస్తే .
నీ క చ ట తపనాలలో కరుగుతున్నాదీ సొగసు
నీ గజాద దబ దబలో కధలు ఏమిటో తెలుసూ
నంద నందనా ముద్దే ముందు ముందునా
అందు ఇందునా నేనే నీకు చెందనా
వరించాను వెచ్చగా వసంతాల చాటు నా
సుఖించాలి జంట గా సుతారాలు మీటనా
నా మాట విను మదన విడిచి నేను పో గలనా
లవ్ అన్నదే తపనా లాలి పాడవే లలనా

సాహిత్యం: సిరివెన్నెల