Ammaye

Ammaye

Udit Narayan & Kavitha Subramanyam

Альбом: Kushi
Длительность: 4:52
Год: 2001
Скачать MP3

Текст песни

అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే

అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే

అబ్బాయే సూటిగా కన్నెత్తి చూడగా
ఆ వాడి చూపులకు మంచైన మరిగేలే

ఆ నవ్వులు హో హో
ఈ చూపులు హో హో
ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే

అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే

ప్రేమలు పుట్టే వేళ పగలంతా రేయేలే (అమ్మమ్మో)
ప్రేమలు పండే వేళ జగమంతా జాతరలే (అమ్మమ్మో)
ప్రేమే తోడుంటే పామైనా తాడేలే
ప్రేమే వెంటుంటే రాయైనా పరుపేలే
నీ ఒంట్లో ముచ్చెమటైనా నా పాలిట పన్నీరే
నువ్విచ్చే పచ్చి మిరపైనా నా నోటికి నారింజే
ఈ వయసులో హో హో
ఈ వరుసలో హో హో
ఈ వయసులో ఈ వరుసలో నిప్పైనా నీరేలే.

అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే

నేనొక పుస్తకమైతే, నీ రూపే ముఖ చిత్రం (అమ్మమ్మో)
నేనొక అక్షరమైతే, నువ్వేలే దానర్ధం (అమ్మమ్మో)
ఎగిరే నీ పైటే, కలిగించే సంచలనం
ఒలికే నీ వలపే, చేయించే తలస్నానం
ఎండల్లో నీరెండల్లో నీ చెలిమే చలివేంద్రం
మంచుల్లో పోగమంచుల్లో నీ తలపే రవి కిరణం
పులకింతలే హో హో
మొలకెత్తగా హో హో
పులకింతలే మొలకెత్తగా ఇది వలపుల వ్యవసాయం

అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే

అబ్బాయే సూటిగా కన్నెత్తి చూడగా
ఆ వాడి చూపులకి మంచైన మరిగేలే

ఆ నవ్వులు హో హో
ఈ చూపులు హో హో
ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే