Yaalo Yaalaa (Extended Film Version)

Yaalo Yaalaa (Extended Film Version)

Anurag Kulkarni

Альбом: Animal - Telugu
Длительность: 5:49
Год: 2023
Скачать MP3

Текст песни

ఓ యాలో యాలా యాలోరే
ఓ యాలో యాలా యాలోరే
ఓ ఎన్నో యేండ్ల సీకటికి
పొద్దు పొడిసిందయ్యో ఈ యాలే
ఓ ఎన్నో యేండ్ల సీకటికి
పొద్దు పొడిసిందయ్యో ఈ యాలే
ఓ యాలో యాలా యాలోరే
ఓ యాలో యాలా యాలోరే
ఎన్నో యేండ్ల ఆకలికి
యాటా మొదలైందయ్యో ఈ యాలే
ఎన్నో యేండ్ల ఆకలికి
యాటా మొదలైందయ్యో ఈ యాలే
మండేటి ఎండల నుండి
యెగసిపడే సూరీడులాగొస్తా
కమ్మేటి మబ్బులు కాల్చి
నీ సుట్టూ ఏన్నెల్లు పొంగిస్తా
నింపేసుకుంటా నిన్ను నాలోనా
అచ్చేసుకుంటా నిన్ను నా మీన
మొక్కేది నిన్నే ఎపుడైనా
నా సామి వంటే నువ్వే లోకానా
సెమ్మా సేరదు మీ కంటా
ఓ సెమ్మా సేరదు మీ కంటా
అమ్మ తోడు నేనుండంగా
మీకు ఆపదే రాదంటా
ఓ పిడుగై నేనటే రానా
ఓ బడాబాగ్నులు ఈదైనా
భూమినైనా బుగ్గి సేసైనా
నీకు ఏమన్నైతే నాన్నా
భూమినైనా బుగ్గి సేసైనా
నీకు ఏమన్నైతే నాన్నా

బతికేదే మీ కోసం
ఈ బతుకే మీ దయా కోసం
మీరే లేరనే ఓ మాట
నిజం కాకున్నా నను సంపేయ్ దా
అది అనేటిదే నోరైనా
దాన్ని ఆడే తవ్వి పాతైనా
ఓ నువ్వు సేసిన బొమ్మనయా
ఓ నువ్వు సేసిన బొమ్మనయా
ఓ నువ్వే దాని పానమయా
నీ పేరే దానిలయా
నువ్వే దాని పానమయా
నీ పేరే దానిలయా

తోడేళ్లు నీకెల్లి తోకలవి జాడిత్తే సింగమై రానా
ఏటాడి ఎటులేసి నెత్తుటేర్లు పారించే నేలనైపోనా
ఓ తోడేళ్ళు నీకెల్లి తోకలవి జాడిత్తే సింగమై రానా
ఏటాడి ఎటులేసి నెత్తుటేర్లు పారించే
నేలనైపోనా నేలనైపోనా
ఒక్క నిజం ఒప్పుకున్నా నాన్న
ఒక్క నిజం ఒప్పుకున్నా నాన్న
ఎంత దూరం ఎల్లె పోరైనా
దెగ్గరోల్ల తోనే అవునా
ఎంత దూరం ఎల్లె పోరైనా
దెగ్గరోల్ల తోనే అవునా

ఓ యాలో యాలా యాలోరే
ఓ యాలో యాలా యాలోరే
నీ సావునే సంపేసిందే
నువ్వు పంచినా నీ నెత్తురే
నీ సావునే సంపేసిందే
నువ్వు పంచినా నీ నెత్తురే