Yentha Sakkagunnave
Devi Sri Prasad
4:26ఓరయ్యో నా అయ్యా ఓరయ్యో నా అయ్యా ఈ సేతి తోనే పాలు పట్టాను ఈ సేతి తోనే బువ్వ పెట్టాను ఈ సేతి తోనే తలకు పోసాను ఈ సేతి తోనే కాళ్లు పిసికాను ఈ సేతి తోనే పాడే మొయ్యలా ఈ సేతి తోనే కొరివి పెట్టాలా ఓరయ్యో నా అయ్యా ఓరయ్యో నా అయ్యా ఈ సేతి తోనే పాలు పట్టాను ఈ సేతి తోనే బువ్వ పెట్టాను ఈ సేతి తోనే తలకు పోసాను ఈ సేతి తోనే కాళ్లు పిసికాను ఈ సేతి తోనే పాడే మొయ్యలా ఈ సేతి తోనే కొరివి పెట్టాలా ఓరయ్యో నా అయ్యా ఓరయ్యో నా అయ్యా మాకు దారి సూపిన కాళ్లు కట్టెల పాలయ్యేనా మా భుజము తట్టిన సేతులు బూడిదయిపోయేనా మా కళలు సూసిన కళ్ళు కాలికమిలిపోయేనా మమ్ము మేలుకొలిపిన గొంతు గాఢ నిదురపోయేనా మా బాధలనోదార్చ తోడుండే వాడివిరా ఈ బాధను ఓదార్చ నువ్వుంటే బాగుండురా ఓరయ్యో నా అయ్యా ఓరయ్యో నా అయ్యా ఈ సేతి తోనే దిష్టి తీసాను ఈ సేతి తోనే ఎన్ను నిమిరాను ఈ సేతి తోనే నడక నేర్పాను ఈ సేతి తోనే బడికి పంపాను ఈ సేతి తోనే కాటికి పంపాలా ఈ సేతి తోనే మంటల కలపాలా ఓరయ్యో నా అయ్యా ఓరయ్యో నా అయ్యా తమ్ముడి నీకోసం తల్లడిల్లాడయ్యా సెల్లి గుండె నీకై సెరువైపోయిందయ్యా కంచంలోని మెతుకు నిన్నే ఎత్తికెనయ్యా నీ కళ్లద్దాలు నీకై కలియజూచినయ్యా నువ్వు తొడిగిన సొక్కా నీకై దిగులు పడి సిలికా కొయ్యకూరి పెట్టుకుంది రయ్యా రంగస్థలాన రంగస్థలాన నీ పాత్ర ముగిసేనా వల్లకాట్లో శూన్య పాత్ర మొదలయ్యేనా నీ నటనకి కన్నీటి సప్పట్లు కురిసేనా నువ్వేల్లోత్తానంటూ సెప్పేఉంటావురా మా పాపపూసేవికది ఇనపడకుంటాదిరా ఓరయ్యో నా అయ్యా ఓరయ్యో నా అయ్యా