Manasu Parimalinchene
Ghantasala
4:02కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల అది కనబడితే చాలు నా గుండె గుల్ల కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల అది కనబడితే చాలు నా గుండె గుల్ల కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు వాడు కనబడితే చాలు నా కొళ్లు తెలవదు కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు వాడు కనబడితే చాలు నా కొళ్లు తెలవదు పిక్కలపై దాకా చుక్కల చీర కట్టి పిక్కలపై దాకా చుక్కల చీర కట్టి పిడికిలంత నడుము చుట్టూ పైటకొంగు బిగగట్టి ఎడుతుంటే చూడాలి ఎడుతుంటే చూడాలి దాని నడక అబ్బో ఎరెత్తి పోవాలి దాని ఎనక కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల అది కనబడితే చాలు నా గుండె గుల్ల చురకత్తి మీసాలు జుట్టంత ఉంగరాలు చురకత్తి మీసాలు జుట్టంత ఉంగరాలు బిరుసైన కండరాలు బిరుసైన కండరాలు మెరిసేటి కళ్ల డాలు వస్తుంటే చూడాలి వస్తుంటే చూడాలి వాడి సోకు వాడు వద్దంటే ఎందుకీ పాడు బతుకు కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు వాడు కనబడితే చాలు నా కొళ్లు తెలవదు తలపాగ బాగ చుట్టి ములుకోల చేతబట్టి అరకదిమి పట్టుకొని మెరక చేనులో వాడు తలపాగ బాగ చుట్టి ములుకోల చేతబట్టి అరకదిమి పట్టుకొని మెరక చేనులో వాడు దున్నుతుంటే చూడాలి దున్నుతుంటే చూడాలి వాడి జోరు వాడు తోడుంటే తీరుతుంది వయసు పోరు కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు వాడు కనబడితే చాలు నా కొళ్లు తెలవదు నీలాటి రేవులోన నీళ్ల కడవ ముంచుతూ ఒంగింది చిన్నదీ ఒంపులన్నీ ఉన్నది నీలాటి రేవులోన నీళ్ల కడవ ముంచుతూ ఒంగింది చిన్నదీ ఒంపులన్నీ ఉన్నది చూస్తుంటే చాలు దాని సోకుమాడ పడి చస్తాను వస్తనంటే కాళ్లకాడ కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల అది కనబడితే చాలు నా గుండె గుల్ల కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు వాడు కనబడితే చాలు నా కొళ్లు తెలవదు