Swathilo Muthyamantha
S.P. Balasubrahmanyam
5:14రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా నీ వేడుక చూడాలనీ నీ ముంగిట ఆడాలనీ నీ వేడుక చూడాలనీ నీ ముంగిట ఆడాలనీ ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరీ వచ్చానమ్మా రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా రతనాలమేడలోన నిన్నొక రాణిగ చూడాలని నీ అడుగులు కందకుండా నా అరిచేతులుంచాలని రతనాలమేడలోన నిన్నొక రాణిగ చూడాలని నీ అడుగులు కందకుండా నా అరిచేతులుంచాలని ఎంతగా అనుకున్నాను ఏమిటి చూస్తున్నాను ఎంతగా అనుకున్నాను ఏమిటి చూస్తున్నాను పన్నీటి బతుకులోన కన్నీటి మంటలేనా రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా నీ వేడుక చూడాలనీ నీ ముంగిట ఆడాలనీ ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరీ వచ్చానమ్మా రాణీ రాణమ్మా రానీ కన్నీళ్ళు రానీయమ్మా రాణీ రాణమ్మా రానీ కన్నీళ్ళు రానీయమ్మా సహనం స్త్రీకి కవచమనీ శాంతం అందుకు సాక్ష్యమని సహనం స్త్రీకి కవచమనీ శాంతం అందుకు సాక్ష్యమని ఉన్నాను మౌనంగా కన్నులుదాటని కన్నీరుగా రాణీ రాణమ్మా రానీ కన్నీళ్ళు రానీయమ్మా గుండెరగిలిపోతూవుంటే గూడుమేడ ఒకటేలే కాళ్ళుబండబారిపోతే ముళ్ళు పూలు ఒకటేలే గుండెరగిలిపోతూవుంటే గూడుమేడ ఒకటేలే కాళ్ళుబండబారిపోతే ముళ్ళు పూలు ఒకటేలే ఎదురుగా పొంగే సంద్రం ఎక్కడో ఆవలితీరం ఎదురుగా పొంగే సంద్రం ఎక్కడో ఆవలితీరం ఎదురీత ఆగదులే విధిరాత తప్పదులే రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా నీ వేడుక చూడాలనీ నీ ముంగిట ఆడాలనీ ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరీ వచ్చానమ్మా రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా