Kannula Baasalu

Kannula Baasalu

Karthik

Длительность: 5:50
Год: 2004
Скачать MP3

Текст песни

కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగవులే
ఒకవైపు చూపి మరువైపు దాచగ
అద్దాల మనసు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే
ఇవి అద్దాల మనసు కాదులే
చేతులు సంద్రాన్ని మూయలేవులే
గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగవులే
దెబ్బలెన్నీ తిన్న గానీ మనసు మాత్రం మారదులే
ఒకపరి మగువ చూడగనే కలిగే వ్యధ తను ఎరుగదులే
అనుదినమూ ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే
హే కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగవులే
ఒకవైపు చూపి మరువైపు దాచగ
అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మూయలేవులే

అడవిలో కాచే వెన్నెల అనుభవించేదెవ్వరులే
కన్నుల అనుమతి పొందీ ప్రేమ చెంతకు చేరదులే
దూరాన కనబడు వెలుగూ దారికే చెందదులే
మెరుపులా వెలుగును పట్టగ మిణిగురు పురుగుకు తెలియదులే
కళ్ళు నీకు సొంతమట కడగళ్ళు నాకు సొంతమటా
అల కడలి దాటగానే నురుగులిక ఒడ్డుకు సొంతమట
కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగవులే
ఒకవైపు చూపి మరువైపు దాచగ
అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మూయలేవులే

లోకాన పడుచులు ఎందరున్ననూ మనసు ఒకరిని మాత్రమే వరియించులే
ఒకపరి దీవించ ఆశించగా అది ప్రాణం తోనే ఆటాడులే
మంచుబిందువొచ్చీ ఢీకొనగా ఈ ముల్లే ముక్కలు అయిపోయెలే
భువిలో ఉన్న అబద్దాలే అరె చీరను కట్టి స్త్రీ ఆయెలే
ఉప్పెనొచ్చినా కొండ మిగులును చెట్లు చేమలు మాయమౌనులే
నవ్వువచ్చులే ఏడుపొచ్చులే ప్రేమలో రెండూ కలిసే వచ్చులే
ఒకపరి మగువ చూడగనే కలిగే వ్యధ తను ఎరుగదులే
అనుదినమూ ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే
కన్నుల బాసలు