Ennenno Janmala Bandham

Ennenno Janmala Bandham

S.P. Balasubrahmanyam, Vani Jairam

Длительность: 3:35
Год: 1979
Скачать MP3

Текст песни

ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను
ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ

పున్నమి వెన్నెలలోనా పొంగును కడలి
నిన్నే చూసిన వేళా నిండును చెలిమి
ఓహో హో హో నువ్వు కడలివైతే
నే నదిగ మారి చిందులు వేసి వేసి నిన్ను చేరనా చేరనా చేరనా
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ

కోటి జన్మలకైనా
కోరేదొకటే
నాలో సగమై ఎపుడూ
నేనుండాలి
ఓహో హో హో నీ ఉన్నవేళా ఆ స్వర్గమేలా
ఈ పొందు ఎల్ల వేళలందు ఉండనీ ఉండనీ ఉండనీ
ఎన్నెన్నో ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ
ఎన్నటికీ ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను
ఆఅహాహహహాఅ ఓహోహోహొహో