Naanaa Hyraanaa (From "Game Changer") (Telugu)

Naanaa Hyraanaa (From "Game Changer") (Telugu)

Shreya Ghoshal

Длительность: 4:33
Год: 2024
Скачать MP3

Текст песни

నాదిరి దిన్న నాదిరి దిన్న నాదిరి దిన్న
నాదిరి దిన్న నాదిరి దిన్న దిల్లా నా దిన్న
నాదిరి దిన్న నాదిరి దిన్న నాదిరి దిన్న
నాదిరి దిన్న నాదిరి దిన్న దిల్లా నా దిన్న

నానా హైరాణా
ప్రియమైన హైరాణా
మొదలాయే నాలోన
లలనా నీ వలన

నానా హైరాణా
అరుదైన హైరాణా
నెమలీకల పులకింతై
నా చెంపలు నిమిరేనా

దానా దీన ఈ వేళ
నీ లోన నా లోన
కానివినని కలవరమే
సుమశరమా

వందింతలయ్యే నా అందం
నువ్వు నా పక్కన ఉంటె
వజ్రంలా వెలిగా ఇంకొంచెం
నువ్వు నా పక్కన ఉంటె

వెయ్యింతలయ్యే నా సుగుణం
నువ్వు నా పక్కన ఉంటె
మంచోడ్నవుతున్న మరి కొంచెం
నువ్వు నా పక్కన ఉంటె

నాదిరి దిన్న నాదిరి దిన్న నాదిరి దిన్న
నాదిరి దిన్న నాదిరి దిన్న దిల్లా నా దిన్న
నాదిరి దిన్న నాదిరి దిన్న నాదిరి దిన్న
నాదిరి దిన్న నాదిరి దిన్న దిల్లా నా దిన్న

ఎప్పుడూ లేని లేని వింతలు ఇప్పుడే చూస్తున్నా
గగనాలన్నీ పూల గొడుగులు భువనాలన్నీ పాల మడుగులు
కదిలే రంగుల భంగిమలై
కనువిందాయెను పవనములు
ఎవరూ లేని లేని దీవులు నీకూ నాకేనా
రోమాలన్నీ నేడు మన ప్రేమకు జెండాలాయె
ఏమాయో మరి ఏమో
నరనరము నైలు నదాయె

తనువే లేని ప్రాణాలు
తారాడే ప్రేమల్లో
అనగనగ సమయంలో
తొలి కథగా