Puvvalaku Rangeyala

Puvvalaku Rangeyala

Shreya Ghoshal

Альбом: Joru
Длительность: 4:27
Год: 2014
Скачать MP3

Текст песни

అరె ఉన్న కనుపాపకు చూపులు ఉన్న
కనురెప్పల మాటున ఉన్న తన చప్పుడు నీదేనా
చూస్తున్నా పెదవులపై నవ్వులు ఉన్న
పెదవంచున చిగురిస్తున్న అవి ఇప్పుడు నీవేనా
నిజమేనా దూరంగా గమనిస్తున్న
తీరానికి కదిలొస్తున్న నా పరుగులు నీవేనా
అనుకున్న ఊహలకే రెక్కలు ఉన్న
ఊపిరిలో ఊగిసలున్నా నా ఆశలు నీవేనా హా హా
పువ్వులకు రంగెయ్యాల చుక్కలకు మెరుపెయ్యాల
గాలినే చుట్టేయ్యాల తేలిపోనా
పువ్వులకు రంగెయ్యాల చుక్కలకు మెరుపెయ్యాల
గాలినే చుట్టేయ్యాల తేలిపోనా హాయిలోనా

హో  ప్రపంచాన్ని నేను ఇలా చూడలేదు
సమస్తాన్ని నేనై నీతో ఉండనా  ఆ ఆ
సంతోషాన్ని నేను ఎలా దాచుకోను
సరాగాల నావై సమీపించనా
నా చిన్ని చిన్ని చిట్టి చిట్టి
మాటలన్నీ మూటగట్టి ఈ వేళ
నా బుల్లి బుల్లి అడుగులు అల్లి బిల్లి దారులన్నీ దాటేలా
నేనింక నీదాన్ని అయ్యేలా
పువ్వులకు రంగెయ్యాల చుక్కలకు మెరుపెయ్యాల
గాలినే చుట్టేయ్యాల తేలిపోనా

హో  మరో జన్మ ఉంటే నిన్నే కోరుకుంటా
మళ్ళీ మళ్ళీ నీకై ముస్తాబవ్వనా   ఆ ఆ
నిన్నే చూసుకుంటూ నన్నే చేరుకుంటా
నీలో దాచుకుంటూ నన్నే చూడనా
మన పరిచయమొకటే పరిపరి విధములు లాలించే
ఆ పరిణయమెపుడని మనసిపుడిపుడే ఊరించే
చేయి చేయి కలపమనీ
పువ్వులకు రంగెయ్యాల చుక్కలకు మెరుపెయ్యాల
గాలినే చుట్టేయ్యాల తేలిపోనా
పువ్వులకు రంగెయ్యాల చుక్కలకు మెరుపెయ్యాల
గాలినే చుట్టేయ్యాల తేలిపోనా హాయిలోనా