Natho Vasthava
Udit Narayan
4:54(గరెగపరిస, గరెగపరిస గరెగమప, గరెగమప గరెగపరిస, గరెగపరిస గరెగమప, గరెగమప) నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం అనురాగమా అభినందనం అనుబంధమా శుభవందనం నీకోసమే పుట్టానని నా ఊపిరన్నది ఏనాటికి విడిపోనని చెప్పాలనున్నది మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది (గరెగపరిస, గరెగపరిస గరెగమప, గరెగమప గరెగపరిస, గరెగపరిస గరెగమప, గరెగమప) నడి రేయే నిలవదుగా వెన్నెలగా నువ్వు నవ్వతుంటే ఈ హాయే చెదరదుగా నా జతగా నువ్వు చెంతనుంటే చలికాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి చిగురెపుడు రాలదుగా పచ్చనైన ఆశలకి ప్రేమే పందిరై బతుకే విరబూసే వేళ మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది (గరెగపరిస, గరెగపరిస గరెగమప, గరెగమప గరెగపరిస, గరెగపరిస గరెగమప) నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం ఎడబాటే వంతెనగా నడిపెనుగా నిన్ను చేరుకోగా తడబాటే నర్తనగా నీ నడక నన్ను వెతికి రాదా సంకోచం తీర్చగా ముద్దు భాష చేస్తున్నా సంతోషం సాక్షిగా మూగభాష వింటున్నా నీలో లీనమై నేనె నువ్వనిపించేలా మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం నీకోసమే పుట్టానని నా ఊపిరన్నది ఏనాటికి విడిపోనని చెప్పాలనున్నది మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది (గరెగపరిస, గరెగపరిస గరెగమప, గరెగమప గరెగపరిస, గరెగపరిస గరెగమప, గరెగమప)