Sahasame Cheyyara

Sahasame Cheyyara

S.P.Balasubramanyam

Альбом: Chandralekha
Длительность: 4:31
Год: 1998
Скачать MP3

Текст песни

సాహసమే చేయ్రా డింభకా అన్నది కదరా పాతాళభైరవీ
చొరవగా దూకకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది
ధైర్యముంటే అహహహా దక్కుతుందీ అహహహా రాకుమారీ
తెలివిగా వెయ్రా పాచిక కల్లో మేనకా ఒళ్లో పడదా
సులువుగా రాదుర కుంక బంగారు జింక వేటాడాలిగా
నింగిదాకా అహహహా నిచ్చెనేద్దాం అహహహహా
ఎక్కిచూద్దాం అహహహా ఒహోహో

చందమామను అందుకుని ఇంద్రభవనాన్ని కడతానురా
పడవంత కారులోన బజారులన్ని షికారు చేస్తానురా
సొంతమైన విమానములో స్వర్గలోకాన్ని చుడతానురా
అపుడు అప్సరసలు ఎదురువచ్చి కన్నుకొడతారురా
చిటికేస్తే అహహహా సుఖమంతా అహహహా మనదేరా
సాహసమే చేయ్రా డింభకా అన్నది కదరా పాతాళభైరవీ
చొరవగా దూకకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది
ధైర్యముంటే అహహహా దక్కుతుందీ అహహహా
రాకుమారీ అహహహా ఒహోహో

సున్ని ఉండలు కందిపొడీ ప్యాక్టరీలోన వండించనీ
అమెరికా ఇరాను జపాన్ ఇరాకు జనాలు తింటారనీ
కొన్ని ఎంపిలను కొంటా కొత్త పిఎం ను నేనేనంటా
స్కాములెన్నో చేసి స్విస్ బ్యాంకుకేసి డాలర్లలో తేలుతా
సుడి ఉంటే అహహహా ఎవడైనా అహహహా సూపర్ స్టారే
సాహసమే చేయ్రా డింభకా అన్నది కదరా జై పాతాళభైరవీ
చొరవగా దూకకపోతే అమెరిసాని నువ్వనుకున్నది
ధైర్యముంటే అహహహా దక్కుతుందీ అహహహా
రాకుమారీ అహహహా ఒహోహో